ఆగమం అంటే
🌷మనము అనుకుంటున్నట్లు ఆగమం అంటే సామాన్యమైన పదం కాదు అది సంక్షిప్తం చేయబడ్డ పదం (abbreviated form) అని అంటామే అలాగ "ఆ.గ. మం"
అని అన్నమాట దానివెనుక ఒక శ్లోకం ఉంది మరి అదేమిటో తెలుసుకుందామా....
శ్లో. ఆగతంశివవాక్త్రేభ్యో
గతంచ గిరిజా శృతౌ
మతంచ వాసుదేవస్య
తస్మాదాగమముచ్యతే.....
👉అంటే మనము నిత్యం చేసే వ్రతములు, వినే కథలు దాదాపుగా శివుని నుండి వచ్చినవే
అవికూడా పార్వతీదేవి ఒక సందేహమడిగినట్లు శివుడు వివరించినట్లు ఉంటాయి
చివరికి జగనన్నాటక సూత్రధారి ఐన విష్ణుమూర్తి ఆమోదం, కలగలిసి వచ్చేదాన్నే ఆగమం
అంటారు
ఉ. దా. వైఖానస ఆగమం, పంచరాత్ర ఆగమం.....

No comments:
Post a Comment