సెర్చ్

Wednesday, 12 May 2021

నల్లనివాడు....

                  🌺 నల్లనివాడు..... 🌺


🌷బమ్మెర పోతన తెలుగు కవులలో సుప్రసిద్ధులు వారికి భాగవతం తెనుగించమని రాముని ఆదేశం, ప్రకారంగాకృష్ణభాగవతాన్నిఆంధ్రీకరించారు

🌷కానీ శ్రీరామచంద్రుని  గాధ మాత్రం భారత, భాగవతాల్లోను కలదు.  భారతంలో అరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెబుతున్నట్లు, ఆ కథను ఎఱ్ఱన గారు మనకు అందించారు, భాగవతంలో శుకమహర్షి పరీక్షత్తుకు చెబుతున్నట్లు పోతనగారు నవమస్కంధము నందుపొందుపరిచారు       

🌷మరి ఇందులో విశేషం ఏమిటి అంటే మనకు ప్రసిద్ధంగా ఉన్న "నల్లనివాడు..." అనే పద్యమును దశమస్కంధంలో కృష్ణుని గురించిచెప్పిబడింది



🌼ఉ.నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ

  జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా

    జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!

   మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!  10.1-1012



, కాని అదే ఆరంభంతో పోతనగారు రామచంద్రుని కూడా స్తుతించారు ఆ పద్యాన్ని కూడా చూద్దాం...


🌼నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
                   జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్...   భా. 9-361


భావం.  నల్లనివాడు, పద్మములవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుర్బాణాలు ధరించువాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, శుభములననేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుప్రభువు మా కోరికలు తీర్చుగాక.


🌷అని పోతన గారు రాముణ్ణి కృష్ణుణ్ణి ఇద్దరినీ ఒకే పదారంభంలో స్తుతించారు.


                     🌷🌷🌷🌷🌺🌺🌺🌷🌷🌷







               

No comments:

Post a Comment