🌼మన కవులు భగవంతుని స్తోత్రంచేస్తున్నప్పుడు వారి చమత్కారాన్ని కూడా అందులో జోప్పించారు ఒకసారి అటువంటి శ్లోకాన్ని చూద్దాం
🌷యః పూతనామారణలబ్ధకీర్తిః
కాకోదరో యేన వినీత దర్పః । (కాకోదరః = సర్పం)
యశోదయాలంకృత పుణ్యమూర్తిః
నాథో యదూనామథవా రఘూనామ్।।
🌼ఈ స్తుతి చూడడానికి శ్రీకృష్ణస్తుతి లాగా ఉన్నా ఇందులో రామచంద్రుని స్తుతి కూడా ఉండటం విశేషం
కృష్ణుని పరంగా :-
భావం :-
పూతనను వధించడం చేత కీర్తి పొందిన వాడు,కళీయుని దర్పమణచిన
వాడు, యశోదాదేవి చేత అలంకరింపబడ్డవాడు, అని అర్థంవస్తుంది
రాముని పరంగా :
"యః పూతనామా" రణలబ్ధకీర్తిః
కాకోదరో యేన వినీత దర్పః । (కాకః +దరః = చిన్న కాకి )
యశోదయాలంకృత పుణ్యమూర్తిః (యశః + దయాలంకృత )
నాథో యదూనామథవా రఘూనామ్।।
భావం :-
పవిత్రమైన నామము కలవాడు, యుద్ధము చేత కీర్తిని పొందినవాడు
కాకాసురుని దర్పమణచిన వాడు, కీర్తి,దయ చేత అలంకరింపబడ్డవాడు
అని రామచంద్రుని పరంగా అర్థంవస్తుంది.
🌷🌷🌷చూసారా.... కవి యొక్క చమత్కృతి 🌷🌷🌷

No comments:
Post a Comment