సెర్చ్

Sunday, 11 April 2021

హరిహర స్తుతి

                    🌼  హరిహర స్తుతి🌼



🌸ఒకే శ్లోకం లో ఇరువురను స్తుతించిన పుణ్యాన్ని మనకిచ్చారు పూర్వ కవి ఒకరు
    ఈ స్తుతి లో గర్భితంగా విష్ణుస్తుతి ఉంటుంది మరి ఆ శ్లోకాన్ని చూద్దామా...

🌺గవీశపత్రో! నగజార్తిహారీ!

కుమారతాతః! శశిఖండమౌళిః!

లంకేశసంపూజితపాదపద్మః!

పాయాదనాదిః పరమేశ్వరోనః...

భావం :-  గవీశ పత్రః = నందివాహనుడు, నగజార్తిహారీ = పార్వతీదేవి యొక్క ఆర్తిని తొలగించినవాడు,కుమారతాతః = కుమారస్వామికి తండ్రి ఐనవాడు, శశిఖండమౌళి = అర్థచంద్రుని ధరించినవాడు, లంకేశసంపూజితపాదపద్మః=రావణునిచేత పూజించబడిన పాదములు కలవాడు
పాయాదనాదిః (పాయాత్ + అనాదిః) పరమేశ్వరోనః (పరమేశ్వరః + నః) = అటువంటి ఆది లేనటువంటి పరమేశ్వరుడు మమ్ములను కాపాడుగాక

కాని ఇందులోని విష్ణుస్తుతి రావాలంటే చివరిపాదంలోని (  అనాదిః) అనేపదాన్ని గమనించాలి
దీనికి ఇంకొక అర్థంకూడా ఉంది ప్రతీ పదంలోని మొదటి అక్షరాన్ని తీసివేస్తే ఆ విష్ణుప్రార్థన మనకు తెలుస్తుంది

🌺వీశపత్రో! గజార్తిహారీ!

కుమారతాతః! శిఖండమౌళిః!

లంకేశసంపూజితపాదపద్మః!

పాయాదనాదిః రమేశ్వరోనః...

భావం :- వీశ పత్రః = గరుత్మంతుని వాహనంగా కలిగిన వాడు, గజార్తి హారీ = గజేంద్రుని ఆర్తిని తీర్చినవాడు
మారతాతః = మన్మధుని తండ్రి ఐనవాడు, శిఖండమౌళిః =నెమలిపింఛం ధరించినవాడు,
కేశసంపూజితపాదపద్మః (క + ఈశ) = బ్రహ్మ, శివుల చేత పూజింపబడిన పాదములు కాలవాడు 
రమేశ్వరః = లక్ష్మీదేవికి భర్త(విష్ణువు), అనాదిః = ఆదిలేనివాడు, నః = మమ్ములను, పాయాత్ = రక్షించు గాక

కేవలం ఒక అక్షరాన్ని తొలగించడం వలన శివస్తుతి విష్ణుస్తుతి ఐయ్యింది చూసారా కవి ప్రతిభ......




No comments:

Post a Comment